ఉప్పరగూడెంలో మహా అన్నదానం కార్యక్రమం.
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
5/9/2025
మహబూబాద్ జిల్లా సీరోలు మండలంలోని ఉప్పరగూడెం గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం బోరింగు వద్ద నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఉప్పరగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కాలం ప్రభాకర్ రెడ్డి,మండల యూత్ ఉపాధ్యక్షులు మల్లికంటి సురేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. వారితోపాటు మండల యువజన నాయకులు పెద్దమామ సాయి,మాజీ సర్పంచ్ అక్కనపల్లి ఉప్పలయ్య గ్రామ పార్టీ నాయకులు బొజ్జ రవి,కన్నం రాంబాబు,పగడాల వెంకటనారాయణ కట్కూరి ఉమేష్, పిల్ల స్టంట్ ఎల్లయ్య,ఆడెపు సైదులు,కార్యకర్తలు తదితరులుమహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

