నేటి వారిధి న్యూస్ (ప్రతినిధి) ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో బతుకమ్మ పండుగలో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. 9వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 దొంతరలుగా బతుకమ్మను పేర్చి, అంతా ఒకచోట చేరి ఆడి పాడి బతుకమ్మలను గంగమ్మ లో నిమజ్జనం చేస్తారు.కులాలకు అతీతంగా, పేద ధనిక తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ.నేడు సద్దుల బతుకమ్మ నాడు తంగేడు, గునుగు, కట్ల, చేమంతి, బంతి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, కలువ, తామర వంటి పూలతో బంగారు బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్దంగా గౌరమ్మను పూజిస్తారు. రాగిపళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలు పేర్చి, మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ చాలా అందంగా బతుకమ్మను పేరుస్తారు. దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు.ఇలా తయారు చేసిన బతుకమ్మను పూజించి, సాయంత్ర సమయంలో ఆడబిడ్డలు అందరూ పట్టు చీరలు ధరించి అందంగా ముస్తాబై ఒక చోటకు చేరుతారు. బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడి బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు. ఆపై గౌరమ్మకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మహిళలు అందరూ పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మమహిళల ఉపవాస దీక్షలు తీరక్క పువ్వులతో బతుకమ్మ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

