నేటివారధి న్యూస్
జనవరి 10 నుండి 19 వరకు జరుగనున్న వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, టీటీడీ అన్ని ఏర్పాట్లను శ్రద్ధగా చేపడుతోంది. ఈ క్రమంలో, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ., టీటీడీ సీవిఎస్వో శ్రీధర్ గారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రత్యేక చర్యలు:
భక్తుల సౌకర్యం:
- దర్శనాల సమయం లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు.
పార్కింగ్ స్థలాల పరిశీలన:
- భక్తుల కోసం అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాలను, అవి సరిపోతాయా అనేది పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు స్మార్ట్ ప్లానింగ్.ఈఏర్పాట్లతో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకి మరింత సౌకర్యం అందించే విదంగా ఏర్పాట్లలను పరిశీలించారు.అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అన్ని ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారు తిరుమలలోని పోలీసు అధికారులకు భద్రత పరమైన అంశాలపై దృష్టి సారించి కట్టుదిట్టం చేయాలనీ దిశానిర్దేశం చేశారు.
సమీక్షించిన ముఖ్య అంశాలు:
ట్రాఫిక్ నిర్వహణ రద్దీని సమర్థంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు.రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణకుసిబ్బందికి మార్గదర్శకాలు.
భక్తుల భద్రత- రద్దీ ప్రాంతాల్లో భక్తుల కోసం భద్రతా బలగాలను విస్తృతంగా ఏర్పాటు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు. పార్కింగ్ మరియు ప్రవేశ నిబంధనలు- భారీ వాహనాల పార్కింగ్, చిన్న వాహనాల ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు.దర్శనం కోసం వచ్చిన భక్తుల సౌకర్యార్థంక్యూలైన్ల నిర్వహణ.పోలీస్ మరియు టీటీడీ అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
భక్తుల సురక్షిత దర్శనం మరియు ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ రామ్ కుమార్,తిరుమల డి.ఎస్.పి విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

