నేటి వారధి న్యూస్
భద్రాచలం సాయి డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా PDSU ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు దేశానికి మార్గదర్శకులని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు.
భారత దేశాన్ని హిందుత్వ ఫాసిజం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, విద్యా వ్యవస్థను బలహీనపరచే నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.సెమినార్ అనంతరం భద్రాచలం PDSU డివిజన్ కమిటీని 15 మంది సభ్యులతో ఎన్నిక చేశారు.
PDSU భద్రాచలం డివిజన్ నూతన కమిటీ
డివిజన్ కార్యదర్శి: మునిగేలా శివ ప్రశాంత్
డివిజన్ అధ్యక్షుడు: గండుగుల రామ్ చరణ్
డివిజన్ సహాయ కార్యదర్శి: M. భూమిక
డివిజన్ ఉపాధ్యక్షుడు: K. అక్షయ్ కుమార్
కోశాధికారి: పండు
కమిటీ సభ్యులుD. సరయు, SK నాజీనా, మౌనిక, SK రజిన, నవీన్, సంజు, హేమంత్ తదితరులు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగత్ సింగ్ జీవితాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని అధ్యయనం చేశారు.మునిగేలా శివ ప్రశాంత్,PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి.
భగత్ సింగ్ వర్ధంతి – PDSU డివిజన్ కమిటీ ఎన్నిక
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

