నేటి వారధి న్యూస్ ప్రతినిధి
పూజలు విరాళాలు నిధులపై ప్రచారం కానీ ఆరోపణలపై మౌనం ఎందుకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పలు అంశాలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేవస్థానం పాలనలో పారదర్శకత లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల గురించి అధికారిక ప్రెస్ నోట్ విడుదల కాకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.ఆలయఅధికారుల సమాచార లోపం ప్రస్తుతం ఆలయ పాలనలో కీలక నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, నియామకాలు, సేవలు, ఫిర్యాదులపై ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ పూజలు, పురస్కారాలు, విరాళాలు, నిధుల సేకరణపై మాత్రం విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఇక ముఖ్యమైన విషయమేమిటంటే, ఆలయంలోని అంతర్గత సమస్యలు కొందరు మాత్రమే తెలుసుకుంటున్నారు, మరి మిగతా రిపోర్టర్లకు సమాచారం ఎందుకు అందదు దేవస్థానం అధికారులు అందరికీ సమానంగా సమాచారాన్ని అందించే బాధ్యత వహించాలి.
యాక్షన్ ఉండాలంటే తప్పక వార్త రాయాలాప్రస్తుతం ఆలయంలో రూల్స్‌కు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు.జరుగుతున్నాయని కేవలం కొన్ని వార్తా కథనాలు లేదా సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు వెలుగులోకి వచ్చేదాకా చర్యలు ఉండకపోవడం ప్రధాన ఆరోపణగా నిలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న విషయాలు స్వయంగా అధికారుల దృష్టికి రావాల్సింది పోయి, బయట వెల్లడైన తరువాతే స్పందిస్తారా
కారణం పర్యవేక్షణ లోపమా ఆర్థిక పరమైన కారణమా
ఈ పరిస్థితికి ప్రధాన కారణం పర్యవేక్షణ లోపమా లేక సంబంధిత ఒప్పందాల్లో లోపాలున్నాయా ఇంకా దీని వెనుక ఆర్థికపరమైన దుర్వినియోగం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయ పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, భద్రాచలం శ్రీరాముడి ఖ్యాతికి మచ్చ రాకుండా పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది
భద్రాచలం రామాలయంలో అసలు ఏం జరుగుతోంది
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

