Friday, April 3, 2026

మణుగూరు నుండి ఎటూరి నాగారం వెళ్లే రహదారి (గుంతల) ను వెంటనే మరమ్మతులు చేపట్టాలి  సీపీఐ నిరసన

- Advertisment -

రోడ్డుకు ఇరువైపులా ఇసుక ను తొలగించాలి

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మణుగూరు నుండి ఏటూరి నాగారం వెళ్లే ప్రధాన రహదారి గుంటలను వెంటనే పూడ్చి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మణుగూరు అంబేద్కర్ సెంటర్లో ఉన్న మసీదు నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయి ఇసుక మ్యాటవేసిందని, వెంటనే ఇసుక మేటను, సంబంధిత అధికారులు పట్టించుకోని తొలగించాలని సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శిలు దుర్గ్యాల సుధాకర్, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు లు డిమాండ్ చేశారు మణుగూరు నుండి ఏటూరి నాగారం వెళ్లే ప్రధాన రహదారి గుంతలదగ్గర సిపిఐ నాయకులు నిరసన తేలియ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని,రోడ్లు ఇబ్బందికరంగా మారిందని ,టూ వీలర్స్ ప్రయాణికులు, అనేకమంది గుంటలలో పడి కాళ్లు చేతులు విరగొట్టుకున్నారని, అనేక యాక్సిడెంట్లు జరిగాయని, అయిన దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన స్పందన లేదని, https కు రోజూ కు వందల లారీలు,వరంగలు, ఎటురినాగారంవరకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని, దీంతో పాటు ఈనెల మేడారం జాతర ఉన్న సందర్భంగా మణుగూరు నుండి రెండు రాష్ట్రాల వారు ఈ రహదారి నుండే ప్రయాణాలు చేసే పరిస్థితి ఉన్నందున, ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి శాఖ పట్టించుకుని గుంతలు లేకుండా తాత్కాలిక మరమ్మతులైన చేపట్టి, యాక్సిడెంట్లు జరగకుండా ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారుఅంబేద్కర్ సెంటర్ మసీదునుండి ఎల్ఐసి ఆఫీస్, మైత్రి హోండా షోరూం వరకు రోడ్డుకి ఇరువైపులా సగం రోడ్డు ఇసుకమేట వేసిందని, అనేక టూ వీలర్స్ జారీ ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని, రోడ్డు మీద ఉన్నటువంటి ఇసుక మేటలను సంబంధిత అధికారులు తొలగిస్తే ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటుందని, సంబంధిత గ్రామపంచాయతీ లేదా అధికారులు స్పందించి ఇసుక మేటర్ ను తొలగించి, రోడ్డు శుభ్రపరచాలని వారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్కే సర్వర్, మంగి వీరయ్య, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, సిపిఐ మణుగూరు పట్టణ సహాయ కార్యదర్శి చింతల దశరథం, అదబాల ప్రవీణ్, బొగ్గుముట్ట అధ్యక్షులు యాకూబ్, శ్రీకాకుళం వీరమల్లు,లింగస్వామి, దాసరి శ్రీను, యకయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -