నేటి వారధి న్యూస్
ఎకరాకు వేలల్లో పెట్టుబడి
ఏటా పూత పూసింది మొదలు.. కాయలు కోతకు వచ్చే వరకు మామిడి రైతులు పెట్టుబడి రూపంలో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులు అనుకూలించక పూత రాలడం, అకాల వర్షాలు, వడగండ్ల వానలు దిగుబడిని చాలావరకు దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ఏటా మామిడి రైతులకు నష్టాలే మిగులుతుండగా, ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
అకాల వర్షంతో నష్టం
ఇప్పటికే మామిడి పంట్ల సీజన్ నడుస్తుండటంతో చాలా చోట్లా కాయలు కోతకు వచ్చాయి. ఈ క్రమంలోనే నాలుగైదు రోజుల కిందట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా కోతకు వచ్చిన మామిడి కాయలు రాలాయి. ఇదిలాఉంటే గురువారం అర్ధరాత్రి కురిసిన ఈదురుగాలుల వానకు నష్టం మరింత ఎక్కువైంది. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలాల్లో కురిసిన వర్షానికి చాలాచోట్ల మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చెట్లకు ఉన్న కాయలన్నీ నేలరాలడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది
మామిడి రైతులకు ‘అకాల’ దెబ్బ, ఈదురుగాలులకు ఖమ్మంలో తీవ్ర నష్టం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

