నేటి వారధి న్యూస్
ఫిబ్రవరి 17, సోమవారం, అన్నారం గ్రామంలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం గోడపత్రికను మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు విడుదల చేశారు.ఈ వైద్య శిబిరం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం మరియు యువ డైనమిక్ లీడర్ నల్లమోతు సిద్దార్థ జన్మదినాన్ని పురస్కరించుకుని,KVR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ శిబిరాన్ని అపోలో రీచ్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేయుచున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సైదులు, సింగం సత్యనారాయణ, షోయబ్, ఉమా కాంతు రెడ్డి, నిర్వాహకులు వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా ఉచిత వైద్య శిబిరం గోడపత్రిక విడుదల
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

