Friday, April 3, 2026

ముదిగొండ మండల ప్రజలకు డిసెంబర్ 31 సందర్భంగా పోలీసువారి హెచ్చరిక

- Advertisment -

నేటివారధి న్యూస్

డిసెంబర్ 31 రోజు రాత్రి ఒంటి గంట తర్వాత ఎవరు కూడా అనవసరంగా రోడ్లపై తిరగకూడదు.
అర్ధరాత్రి ఒంటిగంట లోపు కూడా, మద్యం సేవించి, వాహనాలని రోడ్లపై నడపరాదు.
వాహనాలకు సైలెన్సర్స్ తీసివేసి విపరీతమైన శబ్దాలు చేస్తూ, బైక్ రేసింగ్ లు చేయడం నిషేధం
రోడ్లపై కేక్ కటింగ్స్ గాని, బాణాసంచా కాల్చడం గాని, మద్యం సేవించి చిందులు వేయటం కానీ, రోడ్లపై విచ్చలవిడిగా తిరగడం గాని చేయకూడదు.
అసాంఘిక నృత్య ప్రదర్శనలకు, DJ లకు అనుమతి లేదు.31తేది రాత్రి ముదిగొండ మండలం లోని ప్రతి గ్రామ సెంటర్లో ముమ్మరంగా వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. పట్టుబడిన వాహనాలను సీజ్ చేయడం వలన జరిమానా, జైలు శిక్ష కూడా పడుతుంది.
ముఖ్యంగా, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, డిసెంబర్ 31 పేరుపై అనవసరమైన ఆర్భాటాలకు పోయి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.మీకు నిర్దేశించిన స్థలాలలో మాత్రమే డిసెంబర్ 31 వేడుకలు చేసుకోండి. డిసెంబర్ 31 అనేది మీ కుటుంబంలో సంతోషం నింపుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే విధంగా, మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ముదిగొండ పోలీసు వారి విజ్ఞప్తి.
మురళి, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ముదిగొండ పోలీస్ స్టేషన్.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -