Saturday, April 4, 2026

మున్నేరు ఉధృతిని పరిశీలిస్తున్న కార్పొరేటర్ తోట రామారావు 

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం :స్థానిక 48వ డివిజన్ లో గత వరద ప్రభావంతో జలమయమైన ప్రాంతాలను పరిరక్షించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లడ్ రిలీఫ్ వాలంటీర్స్ తో ప్రభుత్వ అధికారులు A.E., వార్డ్ ఆఫీసర్ పర్యవేక్షణలో డివిజన్ ఎక్స్ కార్పొరేట్ తోట రామారావు అధ్యక్షతన మున్నేరు పరివాహక ప్రదేశాలను పరిశీలించి ఆ ప్రాంత ప్రజలకు కొంత అవగాహన కల్పించడం జరిగింది. పర్యవేక్షణ అనంతరం
తోట రామారావు మాట్లాడుతూ రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్స్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి మానవియ కోణంలో వారికి సహాయం చేయాలని వరద ఉధృతి పెరిగినచో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావసకేంద్రాలైన Womens college,Naya bazar Jr.College, స్వర్ణ భారతీ కళ్యాణ మండపం లో తరలించే దిశగా ముందుండాలని వారు తెలియజేస్తూ ఆ దిశగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా, కిషన్ నాయక్,మధు,కునుపూరి మహేష్, రవీందర్, సింగం అంజయ్య,సత్యనారాయణ, శ్రీనివాస్, సాయి కిరణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -