Friday, April 3, 2026

మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు చిన్న పిల్లలతో ప్రచారం చేస్తే వాళ్ల అభ్యర్థిని రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరిన బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొంతమంది నిలబడ్డ అభ్యర్థులు నామినేషన్ల పర్వంలో అతి ఉత్సాహంతో చిన్నపిల్లలతో ర్యాలీ పాల్గొనే విధంగా చేశారని మా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చిందని దీనిని పూర్తిగా తప్పు పడుతున్నట్టు ఆయన తెలిపారు బాలల హక్కుల చట్టాన్ని ఉల్లగించే విధంగా అభ్యర్థులు ఇలా చేయడం చాలా బాధాకరం విషయమని పిల్లల హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని ఆయన అన్నారు కొద్ది రోజుల్లో ప్రచారం ప్రారంభం అవుతుంది కాబట్టి పిల్లలచే ప్రచారంలో పాల్గొన్నట్లయితే అభ్యర్థిపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని మా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతున్నట్టు ఆయన తెలిపారు చిన్నారి పిల్లలతో ఎవరైనా ప్రచారం చేపిస్తే ఆయా జిల్లా కమిటీలు వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఫోటో వీడియో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు బాలల హక్కుల ఉల్లంఘిస్తే తొలి ఫ్రీ నెంబర్ 1098 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు గత రెండు దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం బాల కార్మిక నిర్మూలన కోసం బాల్య వివాహాలు నిర్మూలన కోసం నిరంతరంగా మా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -