Saturday, April 4, 2026

యురియా కోసం భారీగా క్యూలో రైతు మహిళలు.

- Advertisment -


ఉదయం 8 గంటలకే వచ్చామని,మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా ఇంకా యూరియా దొరకడం లేదు.
యూరియా దొరకడం లేదని రైతులు నిరాశ.

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
2/9/2025
మహబూబాద్ జిల్లా కొరవి మండలం యూరియా కోసం రైతులకు ప్రతిరోజు తిప్పలు తప్పడం లేదు.మంగళవారం కురవి మండల కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకు కర్షిక సేవా సహకార సంఘం.లి యురియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిలబడి అవస్థలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తాయి. రైతు మహిళలు క్యూ లైన్ లో తిండి కూడా లేకుండా ఒక్క బస్తా ఇచ్చిన సాలు రైతు మహిళలు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి.విసుకెత్తిపోతున్నారు.దీన్ని ఆసరాగా తీసుకొని అధికారులు టోకెన్ ఇవ్వడంలో తీసుకోవడంలో జాప్యం చేస్తూ రైతులను తిప్పించుకుంటున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం లారీ లోడ్ రాగానే రైతులకు టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.లారీలలో యూరియా రావడంతో బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఇప్పటికైనా రైతులకు సరిపడే యూరియా అందించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఉదయం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.గత కొద్ది రోజులుగా యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.ఉదయం 8 గంటలకే.వచ్చామని,మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా ఇంకా యూరియా దొరకడం లేదని రైతులు నిరాశగా చెప్పారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -