Friday, April 3, 2026

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

- Advertisment -


ఎస్.ఎఫ్.ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు
స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు గెదేకు వినతి పత్రం ఇచ్చి నిరసన
రేపు జరిగే MLA ఆఫీసు ముట్టడిని  విజయవంతం చేయాలి

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్.ఎఫ్.ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు గేదెకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు… స్కాలర్షిప్లు విడుదల చేయాలని రెండు సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తున్న కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడం లేదని మండిపడ్డారు.. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక రకాల సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చిన వాటి పట్ల కనీసం ఎమ్మెల్యేలు సమస్యను పరిష్కరించడం లేదని అన్నారు.. కనీసం విద్యార్థుల సమస్యలు విందానికి ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదని అన్నారు.. అందువలనే ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గేదెలకు వినతి పత్రాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు..రేపు ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో జరిగే ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టన్ని విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు భాషాపాక పవన్, గుండ్ల రాకేష్ పట్టణ నాయకులు వంశీ ,అనిల్ ,వినయ్ ,ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -