Saturday, April 4, 2026

రేపటి నుంచి ఆషాఢ మాసం బోనాలు.గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం

- Advertisment -

నేటి వారధి న్యూస్
హైదరాబాద్ వచ్చే నెల 21 వరకు జాతర ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారం భమవుతున్నాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాతబ స్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను ఇప్పటికే మం జూరు చేసింది. పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -