నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
అన్నమయ్య జిల్లాలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుబ్రహ్మణ్యం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో వివరాల మేరకు, గుర్రంకొండ మండలం తరిగొండ హైస్కూల్లో పనిచేస్తున్న జాకీర్ బాషా అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
దీనిపై విచారణ చేపట్టి, ఆరోపణలు ప్రాథమికంగా నిజమని నిర్ధారణ కావడంతో సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు.
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని జాకీర్ భాష సస్పెండ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

