Saturday, April 4, 2026

విద్యుత్ షాక్ తో సూడి ఆవు మృతి

- Advertisment -

నేటి వారధి న్యూస్
కామేపల్లిమండలం లోని గోవింద్రాల గ్రామంలో విద్యుత్ షాక్ తో సూడి ఆవు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన లాకావత్ భీముడు ఆవు గురువారం మేత మేయటానికి సమీపం లోని పంట చేలకు వెళ్ళింది. ఈ క్రమం లో నర్సరీ వద్ద ఉన్న విద్యుత్ సపోర్ట్ తీగకు విద్యుత్ ప్రవహిస్తూ ఉండటంతో ఆవు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందింది.ఆవు విలువ సుమారు 80 వేలు ఉంటుందని రైతు లకావత్ భీముడు పేర్కొన్నాడు. మృతి చెందిన ఆవు వద్ద భీముడు కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కొత్త లింగాల విద్యుత్ శాఖ ఏఈ ఎన్ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన ఆవును పరిశీలించారు. ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతుకు న్యాయం జరిగేటట్లు చూస్తానని తెలిపారు. మండల పశు వైద్య అధికారి డాక్టర్ నాగులు పంచినామా నిర్వహించారు. మృతి చెందిన ఆవును విద్యుత్ శాఖ లైన్ఇన్స్పెక్టర్ ఆశీర్వాదం, జూనియర్ లైన్మెన్ కుమార్, సురేష్, భద్రు, తదితరులు పరిశీలించారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఆవు వద్ద రోదిస్తున్న భీముడు కుటుంబ సభ్యులు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -