నేటి వారిధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామం లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు.. దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇక చిన్నారుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు సంఘటనలలో కుక్కల దాడులతో చిన్నపిల్లలు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

