Saturday, April 4, 2026

వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలి.అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

- Advertisment -

నేటి వారధి న్యూస్
అఖిలభారత పరిశీల వ్యవసాయ కార్మిక సంఘం. ఏ ఐ పి ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం రూరల్ మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ రాంప్రసాద్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారం చేపట్టే 18 నెలలు కావస్తున్న వ్యవసాయ కార్మిక మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు.6 గ్యారంటీలు అమలు సక్రమంగా అమలు జరగటం లేదు. నిరుపేద మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నెలకి 2500 అదే విధంగా జీవనభృతి కింద నెలకి వెయ్యి రూపాయల చొప్పున 18 నెలలకు 18 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయాలి. జీవను మృతి కింద ఇచ్చే వెయ్యి రూపాయలకు ఉపాధి హామీ పనిలో 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలి. రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళలకు భరోసా అమలు చేయాలి
అదేవిధంగా ప్రభుత్వము గ్రామాలలో గ్రామసభల ద్వారా వ్యవసాయ కార్మికులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
ఏ ఆధారము లేనటువంటి కూలీ కుటుంబాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే వారికి కూలీ బంద్ ప్రకటించి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలి.
వ్యవసాయ కూలీలకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం అమలు చేయాలి
ఇప్పటికే అమలులో ఉన్న కనీస వేతన చట్టం అమలు చేసే వారికి న్యాయం చేయాలి.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి రెంటాల యాదగిరి, సంఘం జిల్లా నాయకులు వీర్ల వెంకట అప్పారావు, డివిజన్ నాయకులు రెంటాల రామదాసు, కందుల స్వామి, గుమ్మడి వీరబాబు,
టి యు సి ఐ జిల్లా నాయకులు ఎడ్లపల్లి ఉపేందర్, కొత్త రమేషు, సంగిచెట్టి వీరభద్రం,
ఊసు మోహన్ రెడ్డి రైతు సంఘం డివిజన్ కార్యదర్శి
బార్ లింగయ్య, పయ్యావుల వెంకటేశ్వర్లు, ఎల్లావుల వెంకటేశ్వర్లు నాగండ్ల సుధాకర్, కోట రామలింగం,
కందుల స్వామి, గుమ్మడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు రెంటాలయాదగిరి
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -