నేటి వారధి న్యూస్
జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం లో శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్య చారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థులు కాబోయే మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాముల వారు విచ్చేశారు. వెంకటాద్రి స్వామి మఠం మేనేజర్ ఈశ్వరయ్య చారి చేతుల మీదుగా నూతన పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం వెంకటాద్రి స్వాములవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు యావన్మంది ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజెప్పి ప్రజలందరూ కూడా ఈ ఏడాది సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వారికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు సందేశాన్ని ఇచ్చారు,వేద పండితులు ఈ విశ్వావసు నామ సంవత్సర విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు పుర ప్రజలు పాల్గొన్నారు
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో పంచాంగ శ్రవణం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

