నేటి వారధి న్యూస్
ఖమ్మం స్థానిక 46వ డివిజన్ పరిధిలోని సారది నగర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నం వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. వారి సూచనల ప్రకారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం మరియు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు చెప్పడం ద్వారా ఆరోగ్యంగా మహిళలు ఉండేలా తగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. అంగన్వాడి కేంద్రాలు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు పిల్లలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి కార్యక్రమం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శోభ స్థానికులు లక్ష్మి మల్యాల రమ, చంద్రమ్మ ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు
సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కన్నం వైష్ణవి.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

