Friday, April 3, 2026

సీరోలు, మరిపెడ సర్కిల్ మరియు మరిపెడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, IPS

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ జిల్లా పరిధిలోని సీరోల్, మరిపెడ సర్కిల్ మరియు మరిపెడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. మరిపెడలో నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ స్టేషన్ భవన పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు.పోలీస్ స్టేషన్లలో.బయట–లోపలి పరిసరాలను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. రాబోయే గ్రామపంచాయితీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మండల పరిధిలో ఉన్న గ్రామపంచాయితీల సంఖ్య, సమస్యాత్మక గ్రామాల వివరాలను బౌగోళిక మ్యాప్ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) నుండి తెలుసుకున్నారు. ఎన్నికలు శాంతియుతంగా, నిరభ్యంతరంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికిసూచించారు.అనంతరం వివిధ రికార్డులు, ఫైళ్లను పరిశీలించి మార్గదర్శకాలు ఇచ్చారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కూడా చెప్పారు.ఈ సందర్శనలో మరిపెడ సీఐ రాజకుమార్ గౌడ్, మరిపెడ ఎస్‌ఐ విరభద్రం, సీరోల్ ఎస్‌ఐ సంతోష్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -