Friday, April 3, 2026

సైబర్ నేరగాళ్ల వల్లో పడి 9లక్షల 60 వేల రూపాయలు మోసపోయిన ఉద్యోగి

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీవీరభద్రస్వామి.దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విదులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి జగన్నాధం సైబర్ వలలో పడి 9లక్షల 60 వేల రూపాయలు మోసపోయారు..
అతని 4 క్రెడిట్ కార్డు ల ద్వారా డబ్బులు కాజేశారని గమనించిన బాదితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.ఈ.సందర్భంగా కురవి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య ల సూచనల మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులునిర్వహిస్తున్నామని, అయినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.ఎవరైనా సైబర్ నేరస్తుల బారిన పడినట్లయితే వెంటనే గోల్డెన్ హవర్ ని వినియోగించుకుని 1930 నెంబర్ కి డయల్ చేసినట్లయితే మీ సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్ఐ సతీష్ తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -