నేటి వారధి న్యూస్
ఖమ్మం ….వెలుగులో వెలుగు చూసిన చీకటి కోణం.గోప్యంగా ఉంచిన అవినీతి బయటపడుతుందా.
స్వయం సహాయక సంఘాల గ్రూపు సభ్యులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది వారి ఆర్థిక స్వాలంబన, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి తోడ్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు తీసుకువచ్చి ఎంతో కృషి చేస్తుంది. కొందరి నిర్లక్ష్యము మూలాన ప్రభుత్వం యొక్క ఆశయం నీరు గారి పోతుంది. పట్టణ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఐకెపి ద్వారా పదిమంది గ్రూపు సభ్యులు ఒక గ్రూప్ గా ఏర్పడటంతో ప్రభుత్వ యంత్రాంగము ద్వారా వారికి పలు విషయాల మీద అవగాహన కల్పించి ప్రభుత్వము బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు,వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తూ వారికి ఆర్థిక భరోసా కనిపిస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం స్త్రీనిధి రుణాలు కూడా ప్రత్యేకంగా అందిస్తుంది. మండలంలో సుమారు 1000 గ్రూపులు పైబడి ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని కారణాల వల్ల, కొంత నిర్లక్ష్యం వల్ల ఆగిపోయినవి కొన్ని నామాత్రంగా నడుస్తున్నవి కొన్ని గ్రూపులు రెగ్యులర్ గా నడుస్తూ ఉన్నాయి. వీరిలో కొన్ని గ్రూపులను ఎన్నుకొని ఆసక్తి ఉన్నవారికి పర్సనల్గా స్త్రీ నిధి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే తిరిగి కట్టిన స్త్రీ నిధి రుణాలు కోట్లలో స్వాహా అయినట్లు విశ్వసనీయ సమాచారం తెలియ వచ్చింది. ఇది ఆ నోట ఈ నోట పడటంతో మండలంలో బహిరంగ చర్చ జరగడంతో ఈ అవినీతి మండలంలో కోడై కూస్తుంది. పేదరిక నిర్మూలన కుంటు పడకుండా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏసిబి, సిబిసిఐడి వంటి వాటిని రంగంలో దింపి స్త్రీనిది రుణాలు రికవరీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మరికొంత సమాచారంతో ఎవరి అవినీతి వాటా ఎంత…? అన్నదానిపై స్పష్టతతో అందించడం జరుగుతుంది.
ప్రభుత్వ యంత్రాంగము ఏ విధమైన చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే…..???
స్త్రీనిధి రుణాలు కోట్ల రూపాయల స్వాహా..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

