Friday, April 3, 2026

46వ డివిజన్లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ లు ప్రతి ఏటా డివిజన్ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ చేస్తారు. అందులో భాగంగా 46వ డివిజన్ ముస్లిం కుటుంబాలకు కార్పొరేటర్ గారు తయారు చేయించిన రంజాన్ తోఫాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం సంతోషదాయకమని తెలిపారు. అందరూ సోదర భావంతో మెలిగి పరోపకారం చేయాలని సూచించారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వారు తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ చేసిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ లను అభినందించారు. సమాజంలో అన్ని మతాలు సమానంగా అందరూ అన్ని పండుగలలో భాగస్వాములు కావడమే మన దేశ విశిష్టత అని తెలిపారు. కార్పోరేటర్ కన్నం వైష్ణవి మాట్లాడుతూ ముస్లిం కుటుంబాలకు మాకు తోచిన సాయం అందిద్దామని సదుద్దేశంతో ఈ తోఫా పంపిణీ చేస్తున్నామని, ప్రజలందరూ సంతోషంగా ఉండేలా అల్లా దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఆశ్రిఫ్, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, నాయకులు కాటం కొమరయ్య, దేవర వెంకన్న, శనిగరం ఉప్పలయ్య, బాల్దే నాగేశ్వరరావు, కాటం యాదయ్య, అచ్చిని వెంకటేశ్వర్లు, గోనెల రవిశంకర్, చంద్రమ్మ, ఉపేంద్రమ్మ, గోనెల సునీత, చల్లా రమేష్, గోనెల రవిశంకర్, మీరా సాహెబ్, మీర్జా అజీజుల్లా బేగ్, మస్తాన్, కన్నం రమేష్,కేసోజు వీరాచారి, బుంగ శ్రీనివాస్, ఎరుకనబోయిన వెంకటేశ్వర్లు, షేక్ జానీమియా, పగిళ్ళ బుచ్చిబాబు, వేముల విజయ్, నజీర్, బొల్లక్క శ్రీను కెమిడీ యాదగిరి , గర్షకోటి కిషన్, మోటె జగదీష్, షేక్ మోయిన్, సెల్వం జ్ఞానేశ్వర్, భైరోజు సంతోష్, కర్రె వినోద్, కడగంచి అశోక్, సోమన బోయిన కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -