నేటి వారధి న్యూస్
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మాదారం గ్రామపంచాయతీ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్ కోయిల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 వాగ్దానాలను ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న అమలుపరచటంలో పూర్తిగా విఫలమైందని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో వేస్తామన్న రైతుబంధు పోడు భూములన్నిటికీ పట్టాలు ఏజెన్సీ మండలాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ప్రతి మహిళా ఖాతాలో 2500 రూపాయలు నిరుద్యోగ భృతి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్లు వివిధ రకాల పెన్షన్లు పంటలకు గిట్టుబాటు ధర వ్యవసాయ కూలీలకు ఆటో కార్మికులకు ఏటా 12 వేల రూపాయలు కింటాకు 500 రూపాయల బోనస్ వివిధ రకాల ఆరు గ్యారంటీలు 420 వాగ్దానాలు చేసి అందరికీ అందిస్తామని చెప్పి అరచేతిలో స్వర్గం చేయించి అన్ని వర్గాల ప్రజలందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి కపట నీతిని ప్రజలందరూ అర్థం చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ వీటి అమలుకై ఈనెల 20 తారీఖున హైదరాబాదులో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభకు ఇంటికొకరు చొప్పున కదిలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కావేటి నాగేశ్వరరావు గడ్డం ఎంకన్న కుర్ర శ్రీనివాస్ బి వీరు ఎర్రయ్య నరసింహారావు నరేష్ గోవిందు తావూరియా అంజి సతీష్ శివయ్య తదితరులు పాల్గొన్నారు
6 గ్యారంటీల అమలకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ బహిరంగ సభను జయప్రదం చేయండి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

