నేటివారిధి ప్రతినిధి
ఖమ్మం రూరల్ మండలంలో 54 మంది లబ్ధిదారులకు రూ. 15,89,500 విలువ చేసే చెక్కుల పంపిణీ తిరుమలాయపాలెం మండలంలో 35మంది లబ్ధిదారులకు రూ. 13,43,000 చెక్కుల పంపిణీ చెక్కులను అందచేసిన క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణ కుమారి*
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చెక్కులను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణ కుమారి లబ్దిదారులకు అందించారు. ఖమ్మం రూరల్ మండలంలో 54 మంది లబ్ధిదారులకు రూ. 15,89,500 విలువ చేసే చెక్కులను, తిరుమలాయపాలెం మండలంలో 35మంది లబ్ధిదారులకు రూ. 13,43,000 చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 89మంది లబ్దిదారులకు రూ. 29,32,500 విలువ చేసే చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు,ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపూడి భద్రకాళి, తిరుమలాయపాలెం మాజీ ఎంపీపీ మంగీలాల్ , ఒకటవ డివిజన్ కార్పొరేటర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.



