నేటి వారధి న్యూస్
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ ఖమ్మం జిల్లా ప్రధమ మహాసభ ఈనెల 13న వైరా పట్టణంలో జరుగునుంది ఈ సభను జయప్రదం చేయాలని ఖమ్మం ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు రోడ్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి ఉపేందర్ మాట్లాడుతూ టి యు సి ఐ జిల్లాలో కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తుందని కార్మికుల పక్షాన నీతిగా నిజాయితీగా పనిచేస్తుందని ఉద్యమాలను సమీక్ష చేసుకొని భవిష్యత్తు ఉద్యమ నిర్మాణం కోసం జరిగే సభను జయప్రదం చేయాలని వారు కోరారు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ చట్టం బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారి డిమాండ్ చేశారు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి మోటార్ కార్మికులను రోడ్లపాలు చేస్తుందని పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే వరకు ఆటో మోటార్ కార్మికులు పోరాడాలని వారి పిలుపునిచ్చారు అదేవిధంగా వైరాలో ఈనెల 13న జరిగే TUCI జిల్లా ప్రధమ మహాసభకు ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు టి యు సి ఐ నగర అధ్యక్షులు ములకలపల్లి లక్ష్మీనారాయణ, అక్కి నాగరాజు, నాగన్న, సాదిని ఎల్లయ్య, విజయ్, రాము, చింటూ, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.
TUCI జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

