నేటి వారధి న్యూస్
హైదరాబాద్: ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఫరీద్ (20)పై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలోని ఓ సెలూన్‌లో పనిచేసే సమయంలో బాలికకు ఫరీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెను క్యాబ్‌లో తీసుకెళ్లి ఓ స్నేహితుడి ఇంట్లో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఘటనను వీడియో, ఫొటోలు తీసినట్లు పోలీసులు తెలిపారు.ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బాలికను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 8న నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారణ అయినట్లు సమాచారం.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బెదిరింపులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

