Friday, April 3, 2026

సివిల్ సప్లయ్ హమాలీలు మరియు జిసిసి హమాలీల రేట్ల పెంపుదల జీవోను తక్షణమే మంజూరు చేయాలి

- Advertisment -

నేటి వారిధి న్యూస్
ఖమ్మం
గత సంవత్సరం అక్టోబర్ 3న సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో సివిల్ సప్లయ్ హమాలీల వేతనాలు మరియు జిసిసి కార్మికుల వేతనాల పెంపుదాలపై అనేక చర్చలు జరిగి ఒక ఒప్పందానికి రావడం జరిగింది కమిషనర్ గారు 2024 జనవరి నుండి పెరిగిన వేతనాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి చర్చలు జరిగి సుమారు మూడు నెలల అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము జీవో రూపంలో ఇవ్వపోవడం పై ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు ఏఐటియుసి టియుసిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం
హమాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ( సిఐటియు) అనుబంధం ఎర్ర శ్రీకాంత్ గారు మరియు తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్లు వర్కర్స్ ఫెడరేషన్ (టి యు సి ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ ఏఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లయ్ కార్మికులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపొవడం విఫలమైందని గత వారం రోజుల నుండి జిల్లాలో సివిల్ సప్లయ్ జి సి సి కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం విచారకరమని వారన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు సివిల్ సప్లయ్ అధికారులు స్పందించకపోవడం నిర్లక్ష్యం వ్యవహరించడం సరైనది కాదని ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సమ్మె పైన ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాలో అన్ని రేషన్ షాపులకు రేషన్ సరుకులు ఆగిపోయినవి ప్రజలు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లయ్ కార్మికులకు మరియు జిసిసి కార్మికులకు ఇచ్చిన వేతన ఒప్పందం జీవోను తక్షణమే మంజూ చేసి సమ్మెను విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది
ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా అధ్యక్షులు సిఐటియు అనుబంధం భూక్యా శ్రీను ఇమామ్ గారు మరియు టియుసిఐ ఖమ్మం జిల్లా నాయకులు గోసు పుల్లయ్య పెరబోయిన వెంకన్న బొమ్మకంట రమేష్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -