Friday, April 3, 2026

లబ్దిదారుడికి   CMRF చెక్కు అందజేసిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం నగరం గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సిఫారసు మేరకు మంజూరైన CMRF చెక్కును 46వ డివిజన్ కి సంబంధించిన లబ్ధిదారుడు బుగ్గ బీరయ్య గారికి 46వ డివిజన్ కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా సమస్యలు ఎదురైనప్పుడు వైద్యం కోసం ఆస్పత్రులలో చికిత్స చేయించుకొన్న వారి ఆర్ధిక సహాయం గా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు సీఎం గారి సహాయ నిధి నుండి వారు రూపాయలు Rs.60,000/- అక్షరాల అరవై వేల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ రజ్జి, నగర కాంగ్రెస్ OBC సెల్ చైర్మన్ బాణాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య నాయకులు కాటం యాదయ్య , తొగరు భాస్కర్, మాలిగ గౌరీశంకర్, దయ్యాల నాగేశ్వరరావు, బాల్దె నాగేశ్వరరావు, శనిగరం ఉప్పలయ్య, మంగ యాదయ్య, గోనెల రవిశంకర్, తుపాకుల మధు, ఎమ్మె రామకృష్ణ, రేగు రవీందర్, షేక్ నజీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -