Saturday, April 4, 2026

ఆటో యూనియన్ కార్మికులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ.

- Advertisment -

నేటి వారధి న్యూస్
కాంగ్రెస్ పార్టీ యువనేత తుమ్మల యుగంధర్ జన్మదిన సందర్భంగా ఆటో కార్మికులకు తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ ఏకరూప దుస్తులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సోదరులు నిజాయితీగా వారి వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని, ఎంతో మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తారని, ప్రయాణికులతో సోదరభావంతో మెలుగుతూ నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ వారికి ఏకరూప దుస్తులు అందించామని వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పకుండా యూనిఫామ్ ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్వంచ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు షేక్ రజ్జి, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి కృష్ణ దుస్సా వెంకటరమణ మిరియాల శేఖర్ శ్రీనివాస్ మోటె వెంకన్న, గోనెల రవిశంకర్, అద్దంకి ప్రసాద్, నజీర్, బొల్లక్క శ్రీను, కెమెడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -