నేటి వారధి న్యూస్
జూలై 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ ప్రారంభం.
తెలంగాణలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.మొత్తం 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు త్వరలో పంపిణీ చేయనున్నారు.దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11.3 లక్షల మంది పేదలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.ఇప్పటికే రాష్ట్రంలో 94.72 లక్షల రేషన్ కార్డుల సంఖ్య నమోదై ఉంది.పేదల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యం, కిరాణా సరుకులతో పాటు పలు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం లభించనుంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

