Saturday, April 4, 2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు

- Advertisment -


జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అందుకున్న ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ ఫౌండర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ గోపీనాథ్

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
5/9/2025
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వాటి మీది గూడెం లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వాంకుడోత్ గోపీనాథ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ జన్మదిన సందర్భంగా జరుపుకునేటువంటి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డును ఇతను బోధిస్తున్నటువంటి తీరుతెన్నులు సమాజసేవ కు గాను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ చేతుల మీదుగా ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును అందుకున్నారు.
ఈ ఉపాధ్యాయుడు పిల్లలకు వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తూ చిన్ననాటి నుండే మనకు ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి సమాజంలో ఏ విధంగా ముందుకు నడవాలో చిన్ననాటి నుండే నేర్పిస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ తన వృత్తి ధర్మంతో పాటు ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని తన జీతం నుండి కొంత భాగాన్ని ప్రతి నెల వ్యక్తిస్తూ పిల్లలు యొక్క మరియు పేద విద్యార్థులకు కావలసిన సమీకరిస్తూ సమాజంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు కాకుండా అన్ని పనులు చేయగలరని సమాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయుని గౌరవాన్ని రోజుకు పెంచుతున్నాడు
ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ మనం కష్టాన్ని నమ్ముకుని మన అనుకున్నా లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటే ఫలితమైనది దాని అంతట అదే వస్తుందని నేను వచ్చి పోవడానికి కాదు ఇచ్చి పోవడానికి వాక్యాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నానని ఉపాధ్యాయుడు అనేవారు కేవలం నాలుగు గోడల మధ్యలో పాటలు బోధించడమే కాకుండా విలువలతో కూడిన విద్యను అందించాలని ముఖ్యంగా సమాజంలో వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా చిన్నప్పటినుండి వారికి ఉత్తేజపరుస్తూ వినూత్నమైన రీతులలో పాఠాలు బోధిస్తే పిల్లలు ఆసక్తికరంగా వింటారని దానిని ఆచరణలో పెడతారని దానివల్ల సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు.
నేను భవిష్యత్తులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు అందుకోవాలని అదే లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు..

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -