Friday, April 3, 2026

చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన పునాది

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్‌ సీడీపీవో సీహెచ్‌ కమలప్రియ
చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్‌వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్‌ సీడీపీవో సీహెచ్‌ కమలప్రియ అన్నారు. ఆరేళ్ళలోపు చిన్నారుల సరైన ఎదుగుదలతో పాటు సృజనాత్మకత, సామాజిక వికాసాలను పెంపొందించే దిశగా ప్రారంభించిన ‘పోషణ్‌ భీ…పథాయి భీ’కార్యక్రమంపై స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళ వారం నుంచి మూడు రోజుల పాటు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణా తరగుతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో సీడీపీవో సీహెచ్‌ కమలప్రియ మాట్లాడుతూ స్త్రీశిశు సంరక్షణ, మాతాశిశు మరణాల నివారణలో అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడంలో, ఆరోగ్యకరమైన భవిష్యత్‌ తరాలకు బాటలు వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలే కీలకమని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు పోషకాహారలోపాన్ని ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స, అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో శారీరక, మానసిక వికాసం పెంపొందించడం, ఆటపాటలతో కూడిన బోధన ద్వారా ఒత్తిడి లేని, సృజనాత్మకతతో కూడిన భోదన అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల్లో మరింత మానసిక వికాసం, తెలివితేటలు పెంపొందించే దిశంగా ప్రారంభించిన ‘పోషణ్‌ భీ…పథాయి భీ’ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా అంగన్‌వాడీ టీచర్లంతా కృషి చేయాలని సూచించారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్,అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -