నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులూ ఉన్నట్లు సమాచారం. బాష్కోర్తోస్థాన్ రిపబ్లిక్ లోని ఓ యూనివర్సిటీ విద్యార్థుల హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాష్కోర్తోస్థాన్ రిపబ్లిక్ లోని యూఫాలో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్లో లోకి ఓ యువకుడు కత్తితో ప్రవేశించి అక్కడున్న విద్యార్థులపై దాడికి తెగబడ్డాడు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల పైనా దాడి చేశాడు. ఈ క్రమంలో నిందితుడు కూడా తనను తాను కత్తితో గాయపర్చుకున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. క్షతగాత్రులతోపాటు అతడిని కూడా స్థాని ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయా స్పందించింది. బాధితుల్లో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ట్వీట్ చేసింది. ఈ వ్యవహారంపై స్థానిక అధికారులతో టచ్లో ఉన్నట్లు తెలిపింది. కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు యూనివర్సిటీకి బయల్దేరారని, బాధిత విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించింది.
రష్యాలో కత్తిపోట్ల కలకలం నలుగురు భారతీయ విద్యార్థులకు గాయాలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

