Saturday, August 1, 2026

మంగళగిరి లో జీస్టాట్ బెంచ్ ప్రారంభంఉన్నతాధికారులు, ప్రముఖుల మధ్య బెంచ్ ను ప్రారంభించిన న్యాయమూర్తి భాస్కరరెడ్డి వేమిరెడ్డి

- Advertisment -

నేటి వారధి (ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ :జీఎస్టీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా, అప్పీళ్ల ను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పీల్లెట్ ట్రిబ్యునల్ ( జీస్టాట్ ) ను ఏర్పాటు చేసిందని జీస్టాట్ ఆంధ్రప్రదేశ్ న్యాయవిభాగం ఉపాధ్యక్షులు భాస్కరరెడ్డి వేమిరెడ్డి తెలిపారు మంగళగిరి లో పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ జీస్టాట్ బెంచ్ ను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి వేమిరెడ్డి మాట్లాడుతూ..జీస్టాట్ అనేది వస్తువులు మరియు సేవల పన్ను చట్టాల క్రింద స్థాపించబడిన ఒక చట్టబద్దమైన అప్పీలేట్ సంస్థ అన్నారు. భారతదేశ జీఎస్టీ ప్రయాణంలో జీస్టాట్ ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. జీఎస్టీ వివాద పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా జరిగిన ఈ కీలక పరిణామంలో ప్రారంభోత్సవ రోజునే అప్పీళ్ళ విచారణలు కూడా మొదలయ్యాయి. జీఎస్టీ అప్పీళ్ళ పరిష్కారంలో ఏకరూపత మరియు సమర్థతను పాటిస్తూనే, పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్ధవంతమైన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునల్ యొక్క నిబద్దతను ఆయన నొక్కి చెప్పారు. అప్పీల్లెట్ యంత్రాంగాన్ని పూర్తిగా కార్యరూపంలోకి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల సమిష్టి కృషిని భాస్కరరెడ్డి ప్రశంసించారు.
జీస్టాట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వీ ఎస్ కే రాయలు మాట్లాడుతూ.. ఈ బెంచ్ ఏర్పాటు వల్ల జీఎస్టీ అప్పీళ్ళ కు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ అంతటా పన్ను చెల్లింపుదారులకు న్యాయం సులభంగా అందుబాటు లోకి వస్తుందని, న్యాయపరమైన వివాదాలు తగ్గుతాయని, జీఎస్టీ విధానం మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీస్టాట్ సాంకేతిక విభాగం సభ్యులు సతీష్ కుమార్ అగర్వాల్, స్టేట్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ ఎ. బాబు, ప్రత్యేక కమిషనర్ నూతలపాటి సౌమ్య, జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ దేవేష్ గుప్తా, కస్టమ్స్ కమిషనర్ ఆర్. కె. రామన్, సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్ రిచర్డ్, కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ లక్ష్మీనారాయణ, జీఎస్టీ అదనపు కమిషనర్ జీ. రామకృష్ణ రాజు యాదవ్, కోర్టు ఆఫీసర్లు వినయ్ కృష్ణ దాసి, సి. హెచ్ ప్రత్యూష అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఎ. పి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ట్యాక్స్ బార్ సభ్యులు, పలువురు పన్ను నిపుణులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -