Wednesday, September 30, 2026

అంబరాన్నంటిన ఆదివార స్వామి జయంతి  ఉత్సవాలు..

- Advertisment -

నేటి వారధి పెద్దపల్లి.ప్రతినిధి

కమాన్ పూర్ ఆగస్టు 24.
కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివారహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు కొనసాగాయి, స్వామి వారి వద్ద ఉదయం నిత్యాభిషేకం గోపూజ నిర్వహించారు, అనంతరం ఆదివారహ హవనము హోమం నిర్వహించడం జరిగింది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం నిత్య పూర్ణాహుతి గావించారు. ఉదయం నుండే భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.కాగా స్వామి వారిని జైపూర్ ఏసిపి ఆరే వెంకటేశ్వర్లు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మాజీ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ ఈ చక్రవర్తి ఈఈ శంకరయ్య ప్రముఖ కాంట్రాక్టర్ పులి విజయేందర్ రెడ్డి, సింగల్ విలో చైర్మన్ ఇలాంటి భాస్కరరావు, కాగా కమాన్ పూర్ మండలానికి చెందిన సంగారెడ్డిలో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త మాదాసు రవీందర్ సుజాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ ఈవో కాంత రెడ్డి, ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు , సముద్రాల వేణుగోపాల చారి,రామానుజం, శ్రీనివాస్, డైరెక్టర్లు, పిల్లి రాజు, తీగల రాజయ్య గౌడ్, బూస శ్రీనివాస్ గౌడ్, చాట్ల రాయమల్లు, బొజ్జ సతీష్, తిమ్మరాజు గిరిజ, తాళ్ల భాగ్య, గాజుల శ్రీనివాస్, కుందారపు శంకర్, అనవేన శ్యామల, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గోదావరిఖని ఏసీపి మడత రమేష్, టూ టౌన్ సీఐ ప్రసాదరావు, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -