Wednesday, September 30, 2026

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు

- Advertisment -

నేటి వారధి న్యూస్
పోలీస్ కమిషనర్
కార్యాలయం ఖమ్మం
రాష్ట్ర,జిల్లా సరిహద్దులో ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు… నిరంతరం పర్యవేక్షణ
పోలీసు, భూగర్భ జల, మైనింగ్ శాఖల అధికారులతో పోలీస్ కమిషనర్ సమావేశం ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీలు నరేష్ కుమార్ , ప్రసాద్ రావు తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అధికారి సాయినాధ్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ అధికారి రమేష్ ఇతర అధికారులతో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాలలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. మైనింగ్ అధికారులు పోలీసు శాఖ వారి సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆదేశించారు.
జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం, అలాంటి ఉల్లంఘన మరియు అక్రమాలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ప్రదాన నిర్వాహకుల పేర్లను తప్పకుండా బయటకు తీసుకురావాలి. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు..
కారేపల్లి- కోతా లింగాలా క్రాస్ రోడ్ ముదిగోండ -వల్లాబి
బోనకల్- వత్సవాయి
మధిర టౌన్- అత్కూర్ క్రాస్ రోడ్ సతుపల్లి టౌన్- గంగారామ్ రింగ్ సెంటర్ చెక్ పోస్టులలో మైనింగ్ స్టాఫ్ తో పాటు పోలీస్ సిబ్బంది 3 షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పోలీస్ కమిషనర్ వివరించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -