నేటి వారధి ఖమ్మం ప్రతినిధి
ఖమ్మం:గంగపుత్ర సంఘం, జూబ్లీ పుర–సారధి నగర్ వారి ఆధ్వర్యంలో గంగమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కొనసాగుతున్న ఆనవాయితీ, సంప్రదాయాలను పాటిస్తూ మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన అలంకరించిన బోనాలను ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో బయలుదేరారు. యువకులు, పెద్దలు మేళతాళాలు, డప్పు చప్పుళ్లతో ముందుకు సాగగా, జూబ్లీ పుర–సారధి నగర్ పురవీధుల్లో ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.అనంతరం భక్తులు మున్నేటి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ గంగాభవాని దేవాలయానికి చేరుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భకుమా గంగపుత్ర సంఘం జూబ్లీ పుర–సారధి నగర్ అధ్యక్షులు కన్నం రమేష్, ప్రధాన కార్యదర్శి గోధుమల శ్రీనివాసరావు, కోశాధికారి సోమనబోయిన కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగమ్మ బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి రైతులకు మేలు జరగాలని, వ్యాపారస్తులకు లాభాలు చేకూరాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అదే విధంగా ఎలాంటి ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించకుండా ప్రజలను చల్లగా కాపాడాలని, సమస్త జీవకోటికి ఆధారమైన నీరు కొరత లేకుండా చూడాలని గంగాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
నీరు ప్రకృతికి, జీవనానికి ఆధారమని, గంగమ్మ తల్లి ఆశీస్సులతో నదులు, చెరువులు, జలవనరులు సమృద్ధిగా ఉండాలని వారు ఆకాంక్షించారు. రైతులు సంతోషంగా ఉండి మంచి దిగుబడులు సాధించాలని, ప్రజలందరికీ జీవనోపాధి, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని కోరారు.అదేవిధంగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొన్నారు. గంగమ్మ బోనాల వంటి పండుగలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
జిల్లా అధ్యక్షులు కన్నం ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని కోరారు. గంగమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించిన గంగపుత్ర సంఘం జూబ్లీ పుర–సారధి నగర్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చేతి కృష్ణ, మాజీ కార్పొరేటర్ కన్నం వైష్ణవి, మాజీ కౌన్సిలర్లు వంగాల వెంకట్, సింగం అంజయ్య, నాయకులు గోధుమల ఉపేందర్, కన్నం రాజేందర్, వడ్డెబోయిన బిక్షపతి, నరుగుల ఆనంద్, చేతి శ్రీనివాస్, కన్నం రవీందర్, పూజారి రాజు, సోమనబోయిన సత్యం, అంబటి రఘుబాబు, నరుగుల రవికుమార్, కన్నం నరేందర్, నరుగుల బలరాం శంకర్, కన్నం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.మహిళలు బోనాలతో, యువత డప్పు చప్పుళ్లతో, పెద్దలు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జూబ్లీ పుర–సారధి నగర్ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. గంగాభవాని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి పచ్చగా కళకళలాడాలని భక్తులు ప్రార్థించారు.
గంగాభవాని అమ్మవారి సన్నిధిలో ఘనంగా గంగమ్మ బోనాల పండుగ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

