నేటి వారధి న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని దీతిక శ్రీ 2026లో నిర్వహించనున్న 2వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ కు ఎంపిక కావడం విశేషం.
అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు శిక్షణలో కఠోర సాధన చేస్తూ ప్రతిభ కనబరిచిన దీతిక శ్రీ, తన ప్రతిభతో వండర్ కిడ్ అవార్డునుకూడాఅందుకుంటాను అని తెలిపిందిఎ . దీతిక శ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్ మరియు సుమలత తమ కుమార్తె విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా SPF అసిస్టెంట్ కమాండర్ కె. చంద్రశేఖర్ గారు, సీఐ కిరణ్ గారు దీతిక శ్రీనిఅభినందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి పాల్వంచకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మాట్లాడుతూ, దీతిక శ్రీ ఎంతో కష్టపడి సాధన చేసే విద్యార్థిని అని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యం ఉందని తెలిపారు.
పాల్వంచకు గర్వకారణం అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన దీతిక శ్రీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

