Wednesday, September 30, 2026

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బజ్జూరి వెంకటరామిరెడ్డి వై ప్రకాష్ పిలుపు

- Advertisment -

నేటి వారధి న్యూస్
నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు 378 రోజులు పోరాడిన సందర్భంగా నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తామని అదేవిధంగా రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి చట్టబద్ధత పరిశీలిస్తామని రైతాంగం పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేస్తామని చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా ఇస్తామని రైతు కూలీలకు పెన్షన్ ఇస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆ హామీను తుంగలో తొక్కి ఆ మూడు నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకురావాలని కేంద్రం కుట్ర పన్నుతున్న సందర్భంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎస్ కే యం జాతీయ నాయకులు జగత్ సింగ్ దలైవాల్ కేంద్రం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 43 రోజులుగా టంగురు జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అయినా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది జగత్ సింగ్ దలైవాల్ కు మద్దతుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో జనవరి 8వ 9వ తారీకులో కేంద్రలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ సగం మందికి కాలేదు రైతు భరోసా ఎకరానికి 15000 ఇవ్వలేదు వ్యవసాయానికి పంటల భీమా లేదు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12000 ఇవ్వలేదు రైతు భరోసా కవులు రైతులకు కూడా వర్తింపజేయాలి రైతు మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఈ హామీలు అమలు చేయకపోతే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ కే కాసిం జిల్లా సహాయ కార్యదర్శి పోలే పొంగు నాగయ్య కోశాధికారి మాతంగి రామస్వామి జిల్లా నాయకులు శీలం సుదర్శన్ చెరుకుపల్లి వీరయ్య దొండేటి వెంకటయ్య తోట చిన్న అప్పారావు గొర్రెపాటి వీరస్వామి అత్యు పుల్లయ్య. కోయిల శ్రీనివాస్. కంచర్ల శ్రీనివాస్ రెడ్డి. బడే. తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -