నేటి వారధి పెద్దపల్లి
ప్రతినిధి
కమాన్ పూర్ ఆగస్టు 14.
కమాన్ పూర్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ ఆదివార స్వామి ఆలయ అభివృద్ధి మరియు లడ్డు కౌంటర్ బాక్స్ కొరకు 1,116 రూపాయలను ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ కు అందజేశారు. మందని పట్టణానికి చెందిన పాండ్రాల మల్లమ్మ స్మారగార్ధం ఆమె కుమారుడు పాండురాల రాజు మరియు కుటుంబ సభ్యులు ₹1,16,116 రూపాయలను అందజేశారు. కాగా ఆయా రూపాయలను ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. ఆయనతోపాటు జైపూర్ ఏసిపి సైతం తమవంతుగా ఆలయ అభివృద్ధికి డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కాంతరెడ్డి, డైరెక్టర్లు పిల్లి రాజు తీగల రాజయ్య గౌడ్ బూస శ్రీనివాస్ గౌడ్, చాట్ల రాయమల్లు, గాజుల శ్రీనివాస్, కుందారపు శంకర్, తదితరులు ఉన్నారు.

