Monday, September 28, 2026

విదేశీ మ‌హిళ‌తో న‌గ్న‌పూజ‌లు.వీడియో రికార్డు చేసి బ్లాక్ మెయిల్.

- Advertisment -

నేటి వారిధి ప్రతినిధి

తమిళనాడు :ఇప్పటికే మన దేశం రావాలంటే విదేశీ పర్యాటకులు భయపడిపోతున్నారు. ఇటువంటి ఘటనలు ద్వారా ఇండియన్స్ అంటే ప్రపంచంలో అసహ్యహించుకొంటున్నారు. వివరాలోనికి వెళితే వీడియో కాల్‌ లో ఓ విదేశీ మహిళ తో నగ్నంగా పూజలు చేయించి, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై లో వెలుగుచూసింది. పోలీసులు వెల్ల‌డించిన‌ వివరాల ప్రకారం.. కెనడా కు చెందిన 37 ఏళ్ల మహిళ ఇటీవల తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్‌లో ఆమెకు చిలుక జోస్యం చెప్పే ఇసక్కిముత్తు అనే వ్యక్తి పరిచయమయ్యాడు ఆమె జాతకం చూస్తూనే నిందితుడు.మిమ్మల్ని గతంలో టీవీలో చూశాను. నేను చెప్పినట్లు చేస్తే మీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు” అని నమ్మబలికాడు. అనుకున్నది సాధించాలంటే నగ్నంగా ఒక ప్రత్యేక పూజ నిర్వహించాలని చెప్పాడు. వీడియో కాల్ ద్వారా కూడా ఈ పూజ‌ చేయవచ్చని ఆమెకు ఆప్ష‌న్ ఇచ్చాడు. అతని మాటలను నమ్మిన బాధితురాలు వీడియో కాల్‌లో నగ్నంగా పూజలో పాల్గొన్నారు ఈ పూజ నిర్వ‌హించినందుకు ఇస‌క్కిముత్తు స‌ద‌రు మ‌హిళ నుంచి రూ.20,000 వసూలు చేశాడు. మ‌రోవైపు ఈ న‌గ్న పూజ కార్య‌క్ర‌మాన్ని అంతా త‌న మొబైల్‌లో రికార్డు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇస‌క్కిముత్తు స‌ద‌రు మ‌హిళ‌కు ఫోన్ చేశాడు. తన వద్ద ఉన్న నగ్న వీడియోను ఆమెకు చూపించాడు. త‌న‌కు ఇంకా డ‌బ్బులు కావాల‌ని, ఇవ్వ‌క‌పోతే న‌గ్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించాడు.దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఇసక్కిముత్తును అరెస్ట్ చేశారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -