Saturday, August 1, 2026

సోనివిజన్ షాపులో జరిగిన ఫోన్ల చోరీ.కీలక ఆధారాలు, వేలిముద్రలను సేకరిస్తున్న క్లూస్ టీమ్

- Advertisment -

ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం:నగరంలోని ప్రముఖ విక్రయ కేంద్రమైన ‘సోని విజన్’ షోరూమ్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేలా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన అధునాతన మొబైల్ ఫోన్లు చోరీ జరిగినట్లు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. షాపు పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -