ప్రెస్ మీట్ లో కేసు వివరములు వెల్లడించిన డి.ఎస్.పి (సెంట్రల్ జోన్) శ్రీ కే. రమేష్ బాబు గారు.
తూర్పు గోదావరి నేటి వారధి:
రాజమహేంద్రవరం, చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ D. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి పర్యవేక్షణ లో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందుకుగాను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా డి.ఎస్.పి( సెంట్రల్ జోన్) శ్రీ K. రమేష్ బాబు గారి అద్వర్యంలో, ఇన్స్పెక్టర్( త్రీ టౌన్) శ్రీ. V. అప్పారావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ . V. అప్పలరాజు గారు, హెడ్ కానిస్టేబుల్స్ టి. లోవకుమార్, యం. వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ విజయ్, పవన్ మరియు కె. శ్రీనివాసరావు అనువారు ది.వి.11.12.2024 తేదిన రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద వెహికల్ చేకింగ్ నిర్వహించుచుండగా, సుమారు 16 సం.లు., నుండి 19 సం.లు., మద్య వయస్సు కలిగిన 4 గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై కాతేరు గ్రామం వైపు నుండి గామన్ బ్రిడ్జ్ వైపు వస్తూ పోలీస్ వారిని చూసి మోటార్ సైకిల్స్ వెనుకకు తిప్పి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వారి వివరములు
- కుప్పం తేజ S/o సురేష్, A/ 19yrs , C/కాపు, రాణిగారి కొట్టు వీది , వీవర్స్ కాలనీ, రాజమహేంద్రవరం.
- ముగ్గురు CICL లు (చట్టంతో సంఘర్షణ పడిన బాలురు)
- శ్రీరామ్ కొంతమురు (పరారిలో ఉన్న ముద్దాయి) పైన తెలిపిన ఐదుగురు స్నేహితులు వీరు జల్సాలకు అలవాటు పడి, జల్సాలు చేయడానికి డబ్బులు లేక ఇళ్ళ ముందు మరియు ఇతర చోట్ల పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను మారు తాళంతో తీసి వాటిని ఎవరికీ తెలియని చోట పార్క్ చేసి వాటిని ఒక్కొక్కటిగా అమ్మి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
మొత్తం ఈ ఐదుగురు ముద్దాయిలు కలసి 29 మోటార్ సైకిళ్ళ ను దొంగాలించినారు. వాటి మొత్తం విలువ సుమారు రు.11,60,000/- (అక్షరాల పదకొండు లక్షల అరవై వేల రూపాయిలు) ఈ చోరి చేసిన మోటార్ సైకిళ్ళ ను కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన వాడబోయిన రమేష్, S/o వెంకట రమణ , A/ 23 సం.లు, C/ సెట్టిబలిజ, బృందావనం కాలనీ మరియు గుర్రాల వెంకన్న ,S/o దుర్గయ్య, A/ 20 సం.లు, C/ ఉప్పరి, రామాలయం సెంటర్, దోసకాయలపల్లి గ్రామం అనువారికి అమ్మినారు మరియు దేవేన రాజు అను వ్యక్తి మోటార్ సైకిళ్ళ ను కొన్ని రాజమహేంద్రవరం లో క్వారీ గోతుల వద్ద ఎవరికీ కనిపించ కుండా దాచి పెట్టినాడు.
ఆ నలుగురు వద్ద నుండి 29 మోటార్ సైకిళ్ళ ను సీజ్ చేసి వారి ని అదుపులోకి తీసుకొని ఈరోజు అనగా ది 11.12.2024 తేదిన CICL అయిన ముగ్గురిని జువైనల్ కోర్టులో, మిగతా ముద్దాయిని రిమాండ్ కు పంపిచడం జరుగుతుంది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…యువత చెడు మార్గాలలోకి వెళ్ళకుండా పిల్లల యొక్క తల్లిదండ్రులు/ పెద్దలు చూడాలని అంతే కాకుండా వారు బాగా చదువు కొని ప్రయోజకులు కావాలని సూచించారు.
మరియు ముద్దాయిలను పట్టుకొని, మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించినారు.

