నేటి వారధి (ప్రతినిధి)
ఖమ్మం : మన సమాజాన్ని పట్టించుకోకుండా బతకలేమని వ్యవస్థల్ని మార్చడానికి ఎవరో ఒకరు నిబద్దత తో తమ పని తాము చేయడమే కోమాకుల సీతారాములు రాసిన హాస్టల్ కతల సారాంశమని కవి, రచయిత విశ్రాంత ఐఏఎస్ అధికారి అంగలకుర్తి విద్యాసాగర్ అన్నారు ఆదివారంనాడు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి , విమర్శకులు, కాళోజీ అవార్డు గ్రహీత డా.సీతారాం అధ్యక్షతన కథకుడు విశ్రాంత హాస్టల్ వార్డెన్ కోమాకుల సీతారాములు రాసిన హాస్టల్ కతలు పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు.ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినది మన మూలాల్ని మరిచిపోకపోవడమేనన్నారు.హాస్టల్ కతలు లో యదార్థ సంఘటనల అనుభవాన్ని సీతారాములు రాశారని తెలిపారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భాంగ్రా భూక్యా మాట్లాడుతూ తనజీవితంలో జరిగిన హాస్టల్ సంఘటనలే హాస్టల్ కతలలో కనిపిస్తున్నాయని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కవి విమర్శకులు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రితం వెలువడిన హాస్టల్ కతలు ఇంకా వాటి ప్రాసంగిత ఉండటం వ్యవస్థ లో రావాల్సిన మార్పు వచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.గౌరవ అతిథిగా పాల్గొన్న టీ జిఓ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీతారాములు లో నిబద్ధత నిజాయితీ ప్రశ్నించే తత్వం ఉన్న వార్డెన్ కావడం వలన ఇటువంటి కథలు రాశారు న్నారు.అనంతరం సీతారాములు శిష్యుడు ప్రముఖ సినీ గేయ రచయిత,సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోని ఘనంగా సన్మానించారు.స్పందనగాఆయన మాట్లాడుతూ తనకు తెలుగు భాష ను నేర్పిన గురువు, ఈ స్థాయిలో ఉండటానికి హాస్టల్ వార్డెన్ గా తనలాంటి ఎందరో గిరిజన విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన అక్షర యోధుడని కొనియాడారు.ఖమ్మంజిల్లాఅంబేద్కర్, సోక్రటీస్, డార్విన్ గా తన గురువు నిలిచారని ప్రశంసించారు.ఘనంగా భీమ్స్ ని కవులు రచయితలు కళాకారులు సన్మానించారు. తన గానంతో సభను రంజింప చేశారు. ఆయన తల్లి తండ్రి ని సత్కరించారు.పుస్తకాన్ని కవి, కథకులు రాచమల్ల ఉపేందర్ సమీక్ష చేస్తూ సత్యం కోసం పోరాటం చేసిన యోధుడిగా అభివర్ణించారు చివరగా రచయిత దంపతులను ఘనంగా.సత్కరించారు.తొలుత గాయకులు పాడిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో లెనిన్ శ్రీనివాస్,పంజాల అయిలయ్య,కటుకోజ్వలరమేష్ ,కె.రామారావు, అరుణకుమారి వెంకటేశ్వరరావు ఖుర్షీద్ ,జి.శ్రీనివాసరావు,మొగిలి, లింగాల రవికుమార్,కొమిరె వెంకన్న,జి.వీరన్న కార్డియాలజిస్ట్ సీతారాం సుబ్బారావు , పిచ్చి రెడ్డి నాగేశ్వరరావు మల్లేశం గోపాలరావు ,యం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మన సమాజం లేకుండా మనంలేం హాస్టల్ కతలు పుస్తకావిష్కరణ లో కవి, కథకులు విశ్రాంత ఐ.ఏ.స్ ఆఫీసర్ అంగలకుర్తి విద్యాసాగర్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

