నేటి వారధి (ప్రతినిధి)
ఖమ్మం:వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ప్రజలు వర్షాల కోసం వినూత్నంగా ప్రార్థించారు. శనివారం గ్రామంలో దేవతకు అత్యంత వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.ఊరి సరిహద్దుల్లోని గ్రామ దేవతలకు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరి నడిబొడ్డున ఉన్న ‘గ్రామ బొడ్రాయి’ వద్దకు చేరి, బిందెలతో నీళ్ళు పోసి (జలాభిషేకం) మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. “వాన కాలం వచ్చి నెల దాటుతున్నా సరిగా వర్షాలు పడక కరువు ఛాయలు అలముకుంటున్నాయి. ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఊరి ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవతను వేడుకున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, రైతులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
వర్షాల కోసం గ్రామదేవతకు బోనాలు.. బొడ్రాయికి జలాభిషేకం..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

