రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న టి.సిద్దు (ఏ ఆర్ సి బార్ ఉద్యోగి) రక్తదానం మరొకరికి ప్రాణదానo
నేటి వారధి (ప్రతినిధి)ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు పట్టణ పరిధిలోని బోసు బొమ్మ సెంటర్ ఎంవిఎస్ (డాక్టర్ రమేష్ బాబు) హాస్పటల్ నందు విసన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన బాణావతు విష్ణుకుమార్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు ప్లేట్లెట్స్ పడిపోయి రక్త శాతం చాలా తక్కువగా ఉంది. ఆయనకు అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం కాగా ఎం వి ఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ మర్సకట్ల కుమార్(సీనియర్ న్యాయవాది &సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్)ని ఫోన్లో సంప్రదించారు వెంటనే స్పందించిన కుమార్ గ్రూప్ సభ్యులైన సిద్దు (తిరువూరు బైపాస్ రోడ్డు ఏ ఆర్ సి బార్ ఉద్యోగి)కి తెలపగా క్షణాల వ్యవధిలో హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది మర్సకట్ల కుమార్, మాదాసు టైటాస్ (సామాజిక కార్యకర్త), వెంపాటినాగయ్య,బాలమర్తి సురేష్, మాళవతు శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్లు ఇస్లావత్ అర్జున్, కోట రాజేష్, హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ & సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిబోయిన నరేష్ పాల్గొన్నారు.
అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే తక్షణం స్పందించి క్షణాల వ్యవధిలో హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన సిద్దుకి విష్ణు కుమార్ కుటుంబ సభ్యులు & డాక్టర్ రమేష్ బాబు మరియు ఏ ఆర్ సి బార్ నిర్వాహకులు చండిక వేణు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

