నేటి వారధి ప్రతినిధి
తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం ఖమ్మం జిల్లా స్థాయి బయలాజి టాలెంట్ టెస్ట్ ను ఖమ్మం మ్యూజియంలో నిర్వహించారు.
ఇంగ్లీష్ మీడియం విభాగంలో. జలగం నగర్ విద్యార్థిని పి. వెన్నెల, ప్రథమ స్థానం, వేంసూర్ హై స్కూల్ విద్యార్థిని సిహెచ్ భాగ్యశ్రీ ద్వితీయ స్థానం రావినూతల హైస్కూల్ విద్యార్థిని పి శ్రీవల్లి తృతీయ స్థానం పొందారు

తెలుగు మీడియం విభాగంలో. కాకరాల పల్లి విద్యార్థి జాషువా ప్రథమ స్థానం, చిరునోముల హైస్కూల్ విద్యార్థి వెంకట శివ తేజ
ద్వితీయస్థానం కుప్పెనకుంట్లహై స్కూల్ విద్యార్థిని మానస తృతీయ
స్థానం పొందారు. విజేతలకు ముఖ్య అతిధులు సీఎంఓ వై రాజశేఖర్ డిఎస్ఓ డి జగదీశ్వర్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి టీబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్యతీయులుగా సీఎం ఓ వై రాజశేఖర్ టి బి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పెసర ప్రభాకర్ రెడ్డి డి.ఎస్.ఓ దుస్సా జగదీష్ టీబీఎస్ఎఫ్ జనరల్ సెక్రెటరీ డాన్ బాస్కో యెన్ జి సి ఇన్చార్జ్ ఈ వెంకటేశ్వర్లు రామారావు యాకూబ్ విష్ణువర్ధన్ పి . ఐలయ్య తదితరులు పాల్గొన్నారు

