నేటి వారధి ప్రతినిధి
ఖమ్మం.జిల్లాకు చెందిన సీనియర్ కళాకారుడు పంజాల ఐలయ్యకు శుక్రవారం ఉద్యమ గాన కోకిల పురస్కారం లభించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం లో, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, యుటిపిఎం సంస్థ నిర్వాహకులు మేకల చంద్రశేఖర యాదవ్, సుదర్శన్ మార్వాడి, రమేష్, చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ గాన కోకిల పురస్కారం అందుకున్న ఐలయ్యను జిల్లా కు చెందిన పలువురు కళాకారులు , సాహితీవేత్తలు , ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

